ఢిల్లీ వాసులకు కాస్త ఊరట.. ట్రాఫిక్ కోసం తెరచిన రోడ్లు

దేశ రాజధానిలో వరద పరిస్థితి మెరుగుపడడంతో, భైరాన్ మార్గ్‌తో సహా కొన్ని రహదారులను ట్రాఫిక్ కోసం తెరిచినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ISBT కశ్మీర్ గేట్ నుంచి తిమార్పూర్. సివిల్ లైన్స్ (మాల్ రోడ్ వైపు) వరకు రింగ్ రోడ్ స్ట్రెచ్ ను తెరిచినట్టు స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సరాయ్ కాలే ఖాన్ నుంచి.. ఐపీ ఫ్లైఓవర్ నుంచి రాజ్‌ఘాట్ వరకు తేలికపాటి వాహనాల కోసం రహదారిని ఓపెన్ చేశారు. అయినప్పటికీ, శాంతి వ్యాన్ నుంచి మంకీ బ్రిడ్జ్, యమునా బజార్-ISBT వరకు రింగ్ రోడ్  ఇప్పటికీ మూసివేసే ఉంచారు. "మజ్ను కా టిలా నుంచి హనుమాన్ సేతు వరకు రింగ్ రోడ్డు ఇంకనూ మూసివేయబడే ఉండగా.. ఐపీ కళాశాల నుంచి చంద్‌గిరామ్ అఖారా వరకు క్యారేజ్‌వే సైతం మూసివేశారు. చంద్‌గిరామ్ అఖారా నుంచి శాంతి వ్యాన్ వరకు క్యారేజ్‌వే పై ఉన్న బురద కారణంగా ఇప్పటికీ దాన్ని ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఇది ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపుతుంది" అని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ముకర్బా నుంచి వజీరాబాద్ వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు రెండు క్యారేజ్‌వేలను తెరిచారు.

ALSO READ :వేంకటేశ్వరుడికి రూ.కోటి 25 లక్షల అభిషేక శంఖం.. విరాళంగా ఇచ్చిన సుధా మూర్తి దంపతులు

ISBT కశ్మీర్ గేట్ మూసివేయబడి ఉండగా, పుష్తా నుంచి శంషాన్ ఘాట్ వరకు ఉన్న పాత ఇనుప వంతెన కూడా ఓపెన్ చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. "సింగు, టిక్రి, రాజోకారి, బదర్‌పూర్, చిల్లా, గాజీపూర్, లోని, అప్సర, భోపురాతో సహా వివిధ ఢిల్లీ సరిహద్దుల నుంచి భారీ వస్తువుల వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. నిత్యావసర వస్తువులు, సహాయక సామగ్రిని తీసుకువెళ్లే వాహనాలపై ఎటువంటి ఆంక్షలు లేవు" అధికారులు స్పష్టం చేశారు.