236కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 65 మంది కొత్త వేరియెంట్ బారినపడగా.. ఢిల్లీలో 64, తెలంగాణ 24, రాజస్థాన్ 21, కర్నాటక 19, కేరళ 15, గుజరాత్ 14, జమ్మూకాశ్మీర్ లో3, ఏపీ, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ లో 2, చండీఘడ్, లద్దాఖ్, తమిళనాడు, బెంగాల్లో ఒక్కో కేసు చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు నిన్నటితో పోలిస్తే దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 18శాతం వరకు పెరిగింది. బుధవారం దేశవ్యాప్తంగా 7,495 కేసులు నమోదయ్యాయి. 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కేరళలో నిన్న అత్యధికంగా 3,205 కేసులు రాగా.. మహారాష్ట్రలో 1,201,తమిళనాడులో 604 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 78,291 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది. 

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణ గ్రామంలో 10 రోజుల లాక్ డౌన్

ఇమ్యూనిటీని సహజంగా పెంచుకుంటున్న భారతీయులు

కరోనా వచ్చినా.. క్రికెట్ ఆగదు