అచ్చంపేట, వెలుగు: పేరెంట్స్ సంపాదించిన ఆస్తులను అనుభవిస్తూ వారిని పట్టించుకోకుంటే మూడు నెలల జైలు శిక్ష ఉంటుందని అచ్చంపేట జూనియర్ సివిల్‌జడ్జి చైతన్య హెచ్చరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో శనివారం అచ్చంపేట మండలం చందాపూర్ హాజీపూర్ , చెన్నారం గ్రామాలలో న్యాయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి చైతన్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం తల్లి దండ్రులను పట్టించుకోక పోతే జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుందన్నారు. అంతేకాదు ఆస్తిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం అసంబద్ధమైన మేసేజ్‌లు ఫార్వర్డ్ చేసే వారిపై కేసులు నమోదు చేసి జైలు పంపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ రాజేందర్, శ్రీధర్ రావు, వెంకట్ షెట్టి, సుదాకర్ పాల్గొన్నారు.