ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్

టెలికాం రంగంలో రిలయన్స్ జియోతో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. బెస్ట్‌ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్‌ చేయడంలో ఎప్పుడూ ముందుండే భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పుడు 398 రూపాయలకు సరికొత్త ప్లాన్ ఆఫర్ చేస్తోంది.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్‌ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి.

రూ.398తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజూ 1.5 GBడేటాను, 100 SMSలను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 70 రోజులు.

ఎయిర్‌టెల్ గతంలో రూ.399 ప్లాన్ ను లాంచ్ చేసింది.ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న యూజర్ కి వ్యాలిడిటీ 84 రోజులు ఉన్న డేటా మాత్రం రోజుకి 1GB లభిస్తుంది.అదే ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ లో రోజుకి 1.5 GB డేటా లభిస్తుంది

ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్ లానే జియోలో కూడా రూ.398 ప్లాన్ ఉంది. జియో రూ.398తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజూ 2GB డేటాను, 100 SMSలను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 70 రోజులు.దీంతో పాటు జియోసూట్ యాప్స్ ను ఫ్రీగా యాక్సిస్ చేసుకోవచ్చు.

365 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,699 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోంది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజు 100 SMSలు, 1GB డేటాను వినియోగించుకోవచ్చు.