బాలీవుడ్ లో రిస్కీ స్టంట్స్ కు కేరాఫ్ అడ్రస్ అక్షయ్ కుమార్. తనదైన మార్క్ తో సినిమాలు చేస్తూ..బీటౌన్ లో దూసుకెళ్తున్న ఈ హీరో..లేటేస్ట్ గా వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నాడు. వెబ్ సిరీస్ టైటిల్ ను..రియల్ అండ్ రిస్కీ స్టంట్ తో అనౌన్స్ చేశాడు, మంటల్లో కాలుతూ..వెబ్ సిరీస్ డిటిల్స్ చెప్పాడు అక్కీ. తన కొడుకు ఆరవ్ తరచూ తనను డిజిటల్ మీడియాలో ఏదైనా ప్రోగ్రామ్ చేయమని అడిగేవాడని అందుకే తాను ‘ది ఎండ్’ అనే ప్రోగ్రామ్ ను చేయనున్నట్లు చెప్పాడు. అమేజాన్ ఫ్రైమ్ వేదికగా ఈ కార్యక్రమం ప్రదర్శితమవనుంది. అక్షయ్ చేసిన ఈ స్టంట్ యూట్యాబ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.
Literally, all fired up for my association with @PrimeVideoIN’s THE END (working title). Trust me, this is only the beginning ?@JSalke @vikramix @Abundantia_Ent pic.twitter.com/BL2PS4iJPQ
— Akshay Kumar (@akshaykumar) March 5, 2019