5వన్డేల సిరీస్..ఆస్ట్రేలియా కైవసం

భారత్ లో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను 3-2 తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన చివరి వన్డే లో 35 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 237 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ(56) , కేదార్ జాదవ్(44), భువనేశ్వర్(46) పరుగులు చేశారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 272 రన్స్ చేసింది.

సిరీస్ లో మొదటి రెండు వన్డేలలో విజయం సాధించిన భారత్ ఆ తర్వాత మూడు వన్డేలలోనూ పరాజయం పాలైంది.