బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ రివ్యూ : తెలంగాణ నేపథ్యంలో సినిమా

రివ్యూ: బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్

రన్ టైమ్: 2 గంటల 20 నిమిషాలు

నటీనటులు – మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న, ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు

సినిమాటోగ్రఫీ – తోట వి రమణ,

ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్,

సంగీతం – సాబూ వర్గీస్,

కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్,

రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.

కథేంటి?

బిలాల్ పూర్ అనే ఊరికి కొత్తగా యువ పోలీసు అధికారి సూర్య (మాగంటి శ్రీనాథ్) వస్తాడు. అక్కడ స్థానికంగా జరిగే గొడవలు చికాకు కలిగిస్తుంటాయి. ఊరిలో కొందరుకుర్రాళ్లు చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడుతుంటారు. వీళ్లను పట్టుకునేందుకు సూర్య ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఊరిలో జరిగిన ఓ ఘోర ఘటనపోలీసులకు సవాలులా మారుతుంది. ఆ సంఘటన ఏంటి?  దాన్ని పోలీసు అధికారి సూర్య ఎలా మార్చాడన్నది ఆసక్తికరంగా సాగే ముగింపు.

నటీనటుల ప్రతిభ..

ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్రలో బాగా నటించాడు. యువ పోలీసు అధికారి సూర్యగా మాగంటి శ్రీనాథ్ పాత్రోచితంగా నటించారు. యువ అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఆయన నటనలో కనిపించాయి. శాన్వీ మేఘన అందమే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది.వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితనం..

తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు ఫర్వాలేదనిపించింది. సాబూ వర్గీస్ సంగీతం ఓకే.నిర్మాణ విలువలు ఇంకా బాగుండాల్సింది. ఆర్ట్ వర్క్,యాక్షన్ సీన్లు,మేకింగ్ పై మరింత దృష్టి పెట్టాల్సింది.

విశ్లేషణ:

‘‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’’ మూవీ ఓ రూరల్ ఎంటర్ టైనర్.ఆ ఊరిలో క్రైమ్ అరికట్టడానికి ఎస్.ఐ ఏం చేశాడు.అందులో భాగంగా ఓ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ.ఈ స్టోరిని కాస్త సహజంగా, వినోదాత్మకంగా మలచడానికి డైరెక్టర్ నాగసాయి మాకం ప్రయత్నించారు. కథ ఇంట్రస్టింగానే ఉన్నా..స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా లోపాలున్నాయి.దానిపై శ్రద్ద తీసుకొని ఉండాల్సింది. కొత్త దర్శకుడు కావడంతో కొన్ని చోట్ల తడబడ్డాడు..కాకపోతే కామెడీ సీన్లు,తెలంగాణ నేటివిటీకి దగ్గరగా తీయడం వల్ల కాస్త ఫర్వాలేదనిపిస్తుంది.ఫస్టాఫ్ కాస్త బోరింగ్ గా అనిపించినా..సెకండాఫ్ లో వేగం పెంచి కథను ఇంట్రస్టింగ్ గా మలిచాడు డైరెక్టర్..వీలుంటే ఓ సారి ట్రై చేయవచ్చు