
యాదగిరిగుట్ట, వెలుగు: కాంగ్రెస్ అంటే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య విమర్శించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి, ఆత్మకూర్(ఎం) మండలం సింగారం, మొరిపిరాలకు చెందిన 300 మంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.
ALSO READ: పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ
అందుకే సీడబ్ల్యూసీ మీటింగ్ నిర్వహణకు పరేడ్ గ్రౌండ్ లో పర్మిషన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులను వాడుకొని గట్టెక్కిన కేసీఆర్.. ఇప్పుడు వాళ్లకు హ్యాండిచ్చి ఎంఐఎంతో కలిసి వెళ్తుండడం ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమన్నారు. బీజేపీతో సయోధ్య కుదిరినందునే కమ్యూనిస్టులను వదిలిపెట్టారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ కు పతనం తప్పదని హెచ్చరించారు. ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకుడు ధనావత్ శంకర్ నాయక్, ఎంపీటీసీలు మోహన్ బాబు నాయక్, శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.