మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం

మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం

నల్లగొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కోసం వెళ్తున్న కెటిఆర్ కు చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా కార్యకర్తలకు కేటీఆర్ అభివాదం చేశారు. చిట్యాల నుంచి నార్కట్ పల్లి కి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే చిట్యాలలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. కేటీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా రోడ్డు మధ్యకు వచ్చారు బీజేపీ కార్యకర్తలు. ఇంటికో ఉద్యోగం అంటివి కేటీఆర్ అంటూ ప్లకార్డులు పట్టుకొని అడ్డుకునే ప్రయత్నించారు. దీంతో అక్కడున్న పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు.