రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ ను గద్దె దించి అధికారం చేపట్టే దిశగా ప్లాన్ చేస్తున్నారు అగ్ర నేతలు . ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో మూడు బహిరంగ సభలు ఏర్పాటుకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు అయితే అమిత్ షా, జేపీ నడ్డా షెడ్యూల్ ఖరారయ్యింది.
ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 15న ఖమ్మం రానున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లిని సంప్రదించింది.
జూన్ 25న నాగర్ కర్నూలు రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల్లోకి తీసుకెళ్లి కేసీఆర్ అరాచక పాలన గురించి వివరించాలని చూస్తోంది.