అధికారంలో ఉంటే భారత్.. లేకపోతే పాక్: కశ్మీర్ నేతలపై కేంద్రమంత్రి ఫైర్

central minister Jitendra singh fires on farooq abdullahకశ్మీర్ రాజకీయ పార్టీల నేతలపై పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా అక్కడ నాయకుల్లో మార్పు రాలేదన్నారు.

‘‘అధికారంలో ఉన్న పార్టీ నేతలు కశ్మీర్ ను భారత్ లో భాగమని చెబుతారు. ప్రతిపక్షంలోకి రాగానే పాకిస్థాన్ లో మంచిని వెతుకుతారు. ఇది కేవలం మొహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీకే పరిమితం కాదు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు కూడా ఇంతే. ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కశ్మీర్ సీఎంగా ఉన్నప్పుడు.. పీవోకేలోని ఉగ్ర స్థావరాలను బాంబులతో  ఎందుకు కూల్చేయట్లేదని పదే పదే కేంద్రాన్ని అడిగేవారు. ఇప్పడు అధికారం లేకపోవడంతో ఆయనే చెబుతున్నారో (కశ్మీర్ లో ఆర్మీ పని తీరుపై) అంతా చూస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.

Latest Updates