సంగీత్ తో వచ్చిన డబ్బులతో గోవులకు గడ్డి : గోరక్షక్

హైదరాబాద్ : గోరక్ష సంరక్షణకై గుజరాత్ లోక్ సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుచ్ కడ్వపటిదర్ సమాజ్ తెలిపింది. ఈ నెల 16న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే ఈ కార్యక్రమంలో గో ప్రేమికులు భారీగా పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు. గుజరాత్లో వర్షాలు లేక గోవులకు గడ్డి దొరకక అల్లాడుతున్నాయని..వాటిని రక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను గుజరాత్, తెలంగాణలోని గోశాలలకు ఇస్తామన్నారు నిర్వాహకులు.

Latest Updates