వైసీపీలో చేరిన దాసరి అరుణ్

హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీల్లో చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నటుడు దాసరి అరుణ్ కుమార్ వైసీపీలో చేరారు. గురువారం హైదరాబాద్ , లోటస్ పాండ్ లోని జగన్  నివాసంలో అరుణ్ కుమార్ కు వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చడం వల్లే తాను వైసీపీలో చేరానని తెలిపారు అరుణ్‌ కుమార్. జగన్ ఆదేశిస్తే పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని అరుణ్ కుమార్ తెలిపారు. ఇటీవలే సినీ నటులు అలీ, రాజా రవీంద్ర, జయసుధ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.