
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అఖండ (Akhanda) ఒకటి. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. బోయపాటి..బాలయ్య కాంబోలో మూడో సినిమాగా వచ్చిన అఖండ..హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్.
లేటెస్ట్గా అఖండ2 మూవీని పట్టాలెక్కించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను స్కంద తర్వాత డైరెక్ట్ చేయబోయే సినిమా అఖండ2 అని సమాచారం. ప్రస్తుతం అఖండ 2 సినిమాపైనే టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.అందుకు గల కారణాలు లేకపోలేదు.
రీసెంట్గా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నుంచి ఓ సినిమా రాబోతున్నట్టు అనౌన్స్మెంట్ఇచ్చారు. కానీ, హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. అయితే..అల్లు అర్జున్‌తో సరైనోడు 2 కోసమా? లేక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోసమా ? అఖండ 2 కోసమా అనేది తెలియాల్సి ఉంది.
అలాగే, అఖండ 2 సినిమానే రాబోతుంది అనడానికి ప్రధాన కారణం ఏంటంటే..ప్రసెంట్ అల్లు అర్జున్, సూర్య వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో బాలకృష్ణ..బోయపాటి కలయికలో సినిమా రావడం పక్కా అంటూ సినీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అఖండ2 కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ బోయపాటి..బాలయ్య కలిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద సింహగర్జన మొదలైనట్టే. త్వరలో గీతా ఆర్ట్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
MASSive forces to reckon with! ❤️?
— Geetha Arts (@GeethaArts) January 26, 2024
A magical reunion of Mass Combo, Ace Producer #AlluAravind garu & Blockbuster Director #BoyapatiSreenu garu ?
Electrifying Update Loading Soon! ⌛️#GAwithBS ? pic.twitter.com/fk1DOB8VnN