ఐదడుగుల పదంగుళాల పొడవుతో అందరినీ ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’ చిట్టిగా తన నటనతోనూ మెప్పించింది. ఆ తర్వాత జెట్ స్పీడులో దూసుకుపోతుంది అనుకుంటే.. సెకెండ్ సినిమా సైన్ చేయడానికి చాలా సమయం తీసుకుంది. ఇప్పుడు సంతోష్ శోభన్‌తో నటించబోతోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.
రీసెంట్‌గా సంతోష్ హీరోగా వచ్చిన ‘ఏక్ మినీ కథ’కి గాంధీయే స్టోరీ అందించాడు. ఇప్పుడు తనతో ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశాడు. ఇందులో తనది చిట్టి కంటే స్ట్రాంగ్ రోల్ అని, యూత్‌కి కచ్చితంగా కనెక్ట్ అవుతుందని ఫరియా అంటోంది. ఇక రవితేజ హీరోగా రూపొందుతున్న ‘రావణాసుర’లోనూ ఫరియా నటించనుందని టాక్. ప్రియాంక అరుళ్ మోహన్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫరియా సెకెండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోందట. ఇక ఫరియా ‘బంగార్రాజు’ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట నెట్‌లో వైరల్ కావడంతో ఆమె ఫుల్ ఖుష్ అవుతోంది. ఏదేమైతేనేం.. ఇప్పటికైనా ఆమె కెరీర్ స్పీడందుకుంది.