భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మహత్య ఘటనలో మరో చిన్నారి మృతి చెందింది. పాల్వంచలో గ్యాస్ లీక్ చేసుకుని కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు సజీవదహనమవ్వగా... మరో చిన్నారి సాహితి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. పాత పాల్వంచలో మండిగ రామకృష్ణ అనే వ్యక్తి తన భార్య నాగలక్ష్మి, కవల పిల్లలు సాహిత్య, సాహితితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
రామకృష్ణకు రూ. 35 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయి. దాంతో ఆస్తి విషయంలో తల్లి, అక్కతో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ విషయంపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కొడుకు వనమా రాఘవ పంచాయితీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వనమా రాఘవ.. ఏక పక్షంగా పంచాయితీ చేసి.. తన కుటుంబానికి అన్యాయం చేశారని రామకృష్ణ రాసిన ఆత్మహత్య లేఖ దొరికింది. తనతో పాటు తన కుటుంబం చావుకు రాఘవ కారణమంటూ దొరికిన లేఖ ఆధారంగా పోలీసులు రాఘవపై 306 సెక్షన్ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
For More News..
సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే తొక్కినట్లా?