ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అడ్వైజర్ గా గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్  (IPL) సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అడ్వైజర్ గా నియమితులయ్యారు. దీనికి సంబంధించి జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో పనిచేయనున్నందుకు సంతోషంగా ఉందన్నారు సౌరవ్ గంగూలీ. జిందాల్‌,JSW సంస్థల గురించి చాలా ఏళ్లుగా తెలుసని..వారి క్రీడా ప్రస్థానంలో కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. గంగూలీ అనుభవం, సలహాలు, సూచనలు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఛైర్మన్‌ పార్థ్‌ జిందాల్. ఆయన నాకు కుటుంబ సభ్యుడితో సమానమన్నారు. గంగూలీ తమ జట్టుకు సలహాదారుగా ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పనిచేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ జట్టు ఇప్పటి వరకు ఒక్క IPL సీజన్‌లోనూ ట్రోఫీని చేజక్కించుకోలేదు. మార్చి 24న ముంబై ఇండియన్స్‌తో, ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.