
అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్(డేరా బాబా)కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది హర్యానా ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా ఇటీవలే పెరోల్ పై జైలు నుంచి విడుదయ్యాడు. సాధ్వీలపై అత్యాచారం, ఓ ప్రముఖ జర్నలిస్టు హత్య కేసులో డేరా బాబా దోషిగా తేలాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెరోల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత డేరాబాబాను ఖలిస్థానీ తీవ్రవాదులు టార్గెట్ చేశారనే వార్తలు వచ్చాయి. దీంతో డేరా బాబాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
మరిన్ని వార్తల కోసం..