హైదరాబాద్​లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పెరిగినయ్

హైదరాబాద్​లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పెరిగినయ్
  • హైదరాబాద్​లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు... ఆగస్టులో 17 శాతం అప్
  • వీటిలో 6,493 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు

హైదరాబాద్​, వెలుగు : ఇండ్ల అమ్మకాలు హైదరాబాద్​లో గత నెల వేగంగా పెరిగాయి. నెలవారీగా 15 శాతం వృద్ధి కనిపించింది.  మొత్తం 6,493 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇవి సంవత్సరానికి 15 శాతం,  నెలవారీగా 17 శాతం పెరిగాయి.  ఆస్తుల మొత్తం విలువ రూ. 3,461 కోట్లుగా తేలిందని నైట్​ఫ్రాంక్​ ఇండియా తెలిపింది. ఇది  వార్షికంగా 22 శాతం,  నెలవారీగా 20 శాతం పెరిగింది.

హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌‌లో హైదరాబాద్, మేడ్చల్-–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. 2023 ఆగస్టులో హైదరాబాద్​లో  రూ.25 నుంచి రూ.50 లక్షల వరకు గల ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. రూ.25 లక్షల లోపు విలువ చేసే ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్లలో 16 శాతంగా ఉన్నాయి. రూ.కోటి  అంతకంటే ఎక్కువ విలువ ఉన్న ఆస్తుల అమ్మకాల రిజిస్ట్రేషన్ల వాటా 2023 జులైలో 9 శాతం ఉంది.

ఇది 2022 ఆగస్టులో  తో పోలిస్తే 8 శాతం పెరిగింది. 2023 ఆగస్టులో ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువగా 1,000–-2,000 చదరపు అడుగుల సెగ్మెంట్లో ఉంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 70  శాతం వరకు ఉంది. చిన్న ఇండ్లకు (500– 1,000 చదరపు అడుగులు) కూడా డిమాండ్  పెరిగింది. ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్లు 2022 ఆగస్టులో 15 శాతం నుంచి 2023 ఆగస్టులో 16 శాతానికి  పెరిగాయి. ముఖ్యంగా 2,000 చదరపు అడుగుల కంటే పెద్ద ప్రాపర్టీలకు కూడా డిమాండ్ పెరిగింది. వీటి రిజిస్ట్రేషన్లు 2022 ఆగస్టులో 9 శాతం నుంచి 2023 ఆగస్టులో 11 శాతాకి పెరిగాయి. 

Also Raed:  హైఅలర్ట్.. కేంద్ర నిఘా వర్గాల నీడలో హైదరాబాద్​

మేడ్చల్​లో అత్యధికం...

 మేడ్చల్-మల్కాజిగిరి 43 శాతం ఇండ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా 39 శాతం అమ్మకాల రిజిస్ట్రేషన్లతో తరువాతి స్థానంలో ఉంది. 2023 ఆగస్టులో నమోదైన మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లాలోనే 17 శాతం నమోదయ్యాయి. ఆగస్టు 2023లో, లావాదేవీలు జరిపిన రెసిడెన్షియల్​ ప్రాపర్టీల సగటు ధరలు 5.7 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. మేడ్చల్‌ జిల్లాలో  వార్షికంగా ధరలు ఆరు శాతం పెరిగాయి.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ధరలు వరుసగా 4 శాతం, 2 శాతం పెరిగాయి. గత నెల హైదరాబాద్‌‌లో ఇండ్ల అమ్మకాలు ప్రధానంగా 1,000-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోనివి ఎక్కువగా ఉన్నాయి.  రూ. 25 –50 లక్షల విలువైన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉన్నాయి.  బల్క్/భారీ లావాదేవీలు కొన్ని హైదరాబాద్,  రంగారెడ్డి వంటి మార్కెట్‌‌లలో జరిగాయి. ఇట్లాంటి ఆస్తులు 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉన్నాయి.

ఇవి రూ. నాలుగు కోట్ల కంటే ఎక్కువ విలువైనవని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్,  మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్   చెప్పారు. ముఖ్యంగా అనేక సౌకర్యాలతో కూడిన ఆధునిక ప్రాపర్టీలకు గిరాకీ బాగా పెరిగిందని తెలిపారు. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలనే ఆర్​బీఐ నిర్ణయం కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత పెంచిందని, అందుకే డిమాండ్​ పెరిగిందని వివరించారు. 
 

మరిన్ని వార్తలు