శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 3 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 3 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల ట్రాలీ బ్యాగ్స్ నుంచి మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మరికొంత మంది సమాచారం ఇచ్చారన్నారు. పాతబస్తీలో బంగారం అక్రమ తరలింపుతో సంబంధమున్న కొన్ని ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు కస్టమ్స్ అధికారులు. బంగారము తరలింపులో మొత్తం సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు అధికారులు. పాతబస్తీకి చెందిన గోల్డ్ స్మగ్లర్స్ ఐదుగురిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. దుబాయ్ నుంచి రెగ్యులర్ గా బంగారాన్ని అక్రమంగా తరలించే కీలక సూత్రధారి కోసం విచారణ కొనసాగిస్తున్నారు కస్టమ్స్ అధికారులు.