జంతువుల కోసం “జూ”లో కూలర్లు

సమ్మర్ స్టార్ట్ అవడంతో హైదరాబాద్ లోని జూ పార్కులో వన్యప్రాణులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు పెరగడంతో జూలోని జంతువులు విలవిల్లాడుతున్నాయి. ఎండవేడిని తట్టుకునేందుకు జూలో కూల్ క్లైమేట్ క్రియేట్ చేశారు. ఎన్ క్లోజర్స్ దగ్గర కూలర్ ఫాగ్ మెషిన్, వాటర్ స్ప్రింకర్స్ తో పెట్టారు. జంతువుల ఫుడ్ హాబిట్స్ తో పాటు మెడికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో స్కూల్స్ కి హాలిడేస్ కావడంతో పిల్లల రష్ ఎక్కువ ఉంటుందని ..అందుకోసం ఇప్పట్నుంచే జంతువు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు అధికారులు.