చైనా వస్తువులను బహిష్కరించండి.. నెటిజన్ల ట్వీట్లు

జేషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకోవడంపై భారత్‌లో తీవ్రంగా వ్యతిరేకతలు వస్తున్నాయి. దీంతో చైనా ప్రాడక్ట్ లను నిషేధించండి అన్న హ్యాష్‌టాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ ప్రతిపాదన తీసుకురాగా.. చైనా దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకోవడం నాలుగోసారి. అప్పటి నుంచి ట్విట్టర్‌లో చైనాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అందులో ఒకరు ట్వీట్‌ చేస్తూ ..1945లో జపాన్‌పై అమెరికా బాంబు వేసిన తర్వాత ఇప్పటి వరకు జపాన్‌ దేశస్తులు అమెరికా వస్తువులను వాడటం లేదని, దేశభక్తి అంటే ఇదీ అని మరోకరు ట్వీట్‌ చేశారు.