సమ్మర్‌లో కూల్ వాటర్ తాగుతున్నారా ?

సమ్మర్‌లో కూల్ వాటర్ తాగుతున్నారా ?


చూస్తుంటే సమ్మర్‌‌‌‌ స్టార్ట్‌‌ అయినట్టే ఉంది. ఎండలు పెరిగినయ్‌‌ అంటే  డీహైడ్రేషన్​ ప్రాబ్లమ్‌‌ పెరిగిపోతుంది. ఎండకు తట్టుకోలేక కూల్‌‌ వాటర్‌‌‌‌ తాగుతుంటారు ఎక్కువగా. అయితే ఇలా కూల్‌‌ వాటర్‌‌‌‌ తాగడం హెల్త్‌‌ కు మంచిది కాదు అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. 

కూల్‌‌ వాటర్‌‌‌‌ తాగడం ఏ సీజన్‌‌లో అయినా అంత మంచిది కాదు. అదే ఎండాకాలంలో అయితే ఎక్కువ చన్నీళ్లే తాగుతారు. అవి తాగి ఇబ్బంది పడకుండా ఉండాలంటే... ఫ్రూట్‌‌ జ్యూస్‌‌లు, కొబ్బరి నీళ్లు తాగడం బెటర్‌‌‌‌. ఇలా చేస్తే హెల్దీగా కూడా ఉండొచ్చు. మామూలుగా అయితే తిన్న వాటిని జీర్ణం చేసుకునే పనిలో ఉంటుంది శరీర వ్యవస్థ. అయితే కూల్​ వాటర్ తాగితే మాత్రం శరీరం చేసే డ్యూటీ మారిపోతుంది. జీర్ణం చేసే పని కాకుండా చల్లని నీళ్లను వేడిగా మార్చే పనిలో పడుతుంది శరీరం. దానివల్ల ఫుడ్‌‌ సరిగ్గా అరగదు. పోషకాలు శరీరానికి అందవు. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్‌‌ ట్రబుల్ లాంటివి కూడా వస్తాయి.

కూల్‌‌ వాటర్‌‌‌‌ ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్‌‌ ప్రాబ్లమ్స్‌‌ వస్తాయి. ఎందుకంటే చల్లని నీళ్లు తాగినప్పుడు బ్రెయిన్‌‌ ఫ్రీజ్ అవుతుంది. అంటే కొన్ని సెకన్లపాటు నరాలు చల్లపడి జివ్వుమని నొప్పి పుడుతుంది. ఇలా జరిగితే  బ్రెయిన్‌‌ పైన ఎఫెక్ట్‌‌ పడే ప్రమాదం ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్‌‌ చేసే వాగస్‌‌ నాడి శరీరంలో మెడ దగ్గర ఉంటుంది. కూల్‌‌ వాటర్‌‌‌‌ తాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్‌‌ రేట్‌‌, పల్స్‌‌ రేట్‌‌ తగ్గి, హార్ట్ఎటాక్‌‌ వచ్చే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే కూల్‌‌ వాటర్ తాగితే శరీరం లోని కొవ్వు బయటికి పోదు. దాంతో బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకున్న వాళ్లు కూల్‌‌ వాటర్‌‌‌‌కు దూరంగా ఉండాలి.