మోడీని మించిన హిందువును నేను : KCR

కరీంనగర్ బహిరంగసభలో దేశంలోని హిందూత్వ రాజకీయాలపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి, గులాబీబాస్ కేసీఆర్. హిందూ, హిందూ అని బీజేపీ వాళ్లు గట్టిగా మాట్లాడుతున్నారనీ … ఏం మేము కాదా హిందువులం అని అన్నారు. పొద్దునలేస్తే ఫేస్ బుక్ లో ఇదే హిందూత్వ లొల్లి జరుగుతోందన్నారు. “మేం వేములవాడ, కొమురవెళ్లి.. గుడులకు పోమా… మీరు లేకపోతే పండుగలు, తద్దినాలు జరగవా… పంతుళ్లను పిల్చుకోమా… యాగాలు , యజ్ఞాలు చేసుకోమా..” అని ప్రశ్నించారు.

ఆ మాటకొస్తే దేశంలో తాను చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఇంకెవరూ చేయరని అన్నారు కేసీఆర్. అసలైన హిందువులు సామాన్య ప్రజలే అన్నారు. దీనిమీద రాజకీయాలు చేసేవాళ్లను ప్రజలు ఓటుతో బదులివ్వాలని కోరారు.

Latest Updates