120 ఎంపీలను జమకట్టిన.. పార్టీలకు ఆల్రెడీ నూరిపోసిన : KCR

కరీంనగర్ బహిరంగసభలో జాతీయ రాజకీయాలు, సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటుపై కీలక విషయాలు చెప్పారు సీఎం కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు కాలం చెల్లిందని… ఇపుడు మార్పు రావాల్సిన టైమ్ వచ్చిందని చెప్పారు. మార్పు రావాలంటే ఎక్కడో ఓ మొగోడు పుట్టాలె.. పొలికేక రావాలె అని తనదైన శైలిలో అన్నారు కేసీఆర్.

16మందిని ఇస్తే ఏం చేస్తావ్ అని దద్దమ్మ పార్టీలు విమర్శిస్తున్నాయనీ అన్నారు కేసీఆర్. గతంలో పార్టీ పెట్టినప్పుడు.. ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు కూడా వాళ్లు అలాగే మాట్లాడారని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ బలోపేతమవుతోందన్నారు. తాను ఇప్పటికే పలు పార్టీల నాయకులను కలిశాననీ… వంద, 120 మందిని జమకట్టానని చెప్పారు కేసీఆర్. ఎన్నికలయ్యాక రాష్ట్రాలుగా మన హక్కులు ఎలా సాధించుకోవాలో ఇప్పటికే అందరికీ నూరిపోశాను.. అన్నీ చెప్పానని వివరించారు. ఎన్నికల ముగిసిన తర్వాత తామే కీలక శక్తిగా మారుతామని అన్నారు.

Latest Updates