మోడీ, రాహుల్ దరిద్రులు.. తరిమికొట్టాలి : KCR

మోడీ, రాహుల్ ఇద్దరికీ తెలివి లేదు

మైకులు పగిలిపోయే స్పీచులిస్తారు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరీంనగర్ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. మోడీ, రాహుల్ గాంధీలు ప్రధానమంత్రి పదవినే గౌరవించరని అన్నారు. 130 కోట్లమందిని రిప్రెజెంటే చేసే ప్రధానమంత్రిని పట్టుకుని రాహుల్ గాంధీ చౌకీదార్ కాదు దొంగ అంటాడని విమర్శించారు. నువ్వు, నీ తల్లి ఇద్దరూ కోర్టులో జమానత్ కట్టి బయట తిరుగుతున్నారని మోడీ విమర్శిస్తుంటారని చెప్పారు.

వీళ్లకు దేశాన్ని పాలించే తెలివితేటలు లేవనీ.. పాకిస్థాన్ ను కంట్రోల్ లో పెట్టుడు తెల్వదనీ.. అంతర్జాతీయ సమస్యలను చక్కబెట్టుకోవడం తెలియడం లేదని విమర్శించారు కేసీఆర్. దేశంలోని 18 రాష్ట్రాల్లో విపరీతమైన కరెంట్ కోతలున్నాయని చెప్పారు. హిమాలయాల అవతల ఉన్న చైనాలో వ్యవసాయ భూమిలేకపోయినా.. వేల కిలోమీటర్లు నీళ్లు తరలించి వాడుకుంటున్నారని .. అమెరికాలాంటి అభివృద్ది చెందిన దేశాల్లో జలవనరులనుంచి విద్యుదుత్పత్తి సమర్థంగా చేస్తున్నారని  అన్నారు. బయటి దేశాలు, మనదేశంలో కరెంట్ ఉత్పత్తి… వాహనాల స్పీడ్ వివరాలను పోల్చుతూ చెప్పారు కేసీఆర్.

మోడీని కొట్టుడొక్కడే తక్కువ : కేసీఆర్

మనదేశంలో 70వేల టీఎంసీల నీళ్లున్నా వాటిని వాడుకునే తెలివిలేక రాష్ట్రాల మధ్య జగడాలు పెడుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ పరిష్కరించాలన్నప్పుడు ఆయన కావేరీ వివాదం గురించి ప్రస్తావించారని.. ఆ సమయంలో మోడీని కొట్టుడొక్కటే తక్కువని కేసీఆర్ అన్నారు.

ఇలాంటి దరిద్రపు నాయకులు మనదేశానికి అవసరం లేదని.. కొత్త నాయకత్వం రావాలన్నారు కేసీఆర్.

Latest Updates