సమర్థవంతమైన పాలన బీజేపీతోనే సాధ్యం : కిషన్ రెడ్డి

కేటీఆర్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. బీజేపీ మతతత్వ పార్టీగా చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దేశంలో సమర్థవంతమైన పాలన బీజేపీతో మాత్రమే సాధ్యమన్నారు. రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రాహుల్ వచ్చిన ప్రతిసారి ఒక వికెట్ పడిపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్, జానారెడ్డి కూడా ఉంటారో.. ఉండరో తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు.