లోక్ అదాలత్ లో 15వేల కేసులు కాంప్రమైజ్

హైదరాబాద్ : లోక్ అదాలత్ తో 2వేల కేసులు కాంప్రమైజ్ అయ్యాయని తెలిపారు సీ.పీ అంజనీ కుమార్. శనివారం హైద్రాబాద్ లో అన్ని కోర్టుల్లో మెగా లోక్ అదాలత్ నిర్వహించినట్లు చెప్పారు. పలు కేసులు పెండింగ్ లో ఉన్నవారు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లు తెలిపారు. నెల రోజులల్లో 2వేల కేసులకు నోటీసులు అందాయని.. ఈ రోజు (శనివారం) దాదాపు హైదరాబాద్ లో 1366 వరకు కేసులు కాంప్రమైజ్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై 20 రోజులుగా నార్త్ జోన్ పోలీసులు శ్రమించినట్లు తెలిపారు. ఈ మెగా అదాలత్ ను మేజిస్ట్రేట్ కూడా అభినందించారు అని సి.పి తెలిపారు.

ఈ రోజు (శనివారం) నేషనల్ లోక్ అదాలత్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల 430 పెండింగ్ కేసుల పరిష్కారం. ఇందులో 6,588 క్రిమినల్ కేసులు, 903 సివిల్ కేసులు, 6311 ప్రి లీటిగేషన్ కేసుల  కాంప్రమైజ్ జరిగినట్లు తెలిపారు.