గంటా ముఖంలో అలక చూడండి… లోకేశ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ తమ మంత్రివర్గంపై వస్తున్న విమర్శలకు వెరైటీగా బదులిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై ఆ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అలకతో ఉన్నారనీ.. పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఓ న్యూస్ ఛానెల్ వార్తను ప్రసారం చేశాయి. దీనిపై లోకేశ్ వెంటనే స్పందించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తనపక్కనే నిలబడి.. నవ్వుతుండగా ఓ సెల్ఫీ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

“ఔను నిజమే.. గంటా శ్రీనివాసరావు గారి ముఖంలో అలక చూడండి” అని కామెంట్ పెట్టారు లోకేశ్. అవినీతి డబ్బా.. అవినీతి పత్రిక అంటూ వార్తను ప్రసారం చేసిన ఛానెల్ పై విమర్శ చేశారు లోకేశ్.