సర్పంచ్ కు ఉన్న సోయి KCR కు లేదు: మంద కృష్ణ మాదిగ

అంబేద్కర్ జయంతి ఉత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవటం.. అంబేద్కర్ ను అవమానించటమేనన్నారు MRPS జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ Mrps పార్శీ గుట్ట కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మంద కృష్ణ మాదిగ. కేసీఆర్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నాలు,  నిరసన దీక్షలు  చేస్తామన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్నా.. కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ కు ఉన్న సోయి కేసీఆర్ కు ఎందుకు లేదని ప్రశ్నించారు. అగ్రకుల అహంకారంతోనే అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో కేసీఆర్ పాల్గొనలేదన్నారు మందకృష్ణ. ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చిన ప్రతి సారి పాదాభివందనం చేసే కేసీఆర్…. రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ దళితుడు కాబట్టి ఎప్పుడు పాదాభివందనం చేయలేదన్నారు.

అంబేద్కర్ విగ్రహం విరగగొట్టి చెత్త వ్యాన్ లో తీసుకువెళ్లి డంప్ యార్డ్ లో  పడవేయడం దారుణమని… ఈ ఘటనపై కనీసం ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదన్నారు. రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పర్మిషన్ లేని విగ్రహాలు ఎన్నో ఉన్నాయన్న మందకృష్ణ మాదిగ…అంబేద్కర్ విగ్రహం తొలగిస్తే..పక్కనే ఉన్న YS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కూడా పర్మిషన్ లేదు… ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదన్నారు. అంబేద్కర్ కు ఇంత అవమానం జరిగిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీలకు  గౌరవం ఎక్కడ ఉందని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ.

Latest Updates