ఈ గుడిలోకి వెళ్లే మగవాళ్లు స్త్రీలా రెడీ కావాలి

గుడిలోకి వెళ్లా లంటే సంప్రదాయ దుస్తులు ధరించాలి. అయితే,కేరళలోని ఒక ఆలయంలో మాత్రం భిన్నమైన ఆచారం ఉంది. కొల్లం జిల్లా లో కొట్టాన్ కొల్లారా ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమగలదని భక్తుల నమ్మకం. అయితే, ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. అదేంటంటే..ఈ ఆలయంలోని పురుషులకు అనుమతి లేదు. కానీ, అక్కడికి వెళ్లాలనుకుంటే పురుషులు..స్త్రీలలా రెడీ అవ్వాలంటే. అంటే చీర కట్టుకోవడంతో పాటు కళ్లకు కాటుక, పెదాలకు లిప్టిక్, తలలోపూలు పెట్టుకోవాలి. ఇలా ఇంట్లోఅలంకరించుకొని గుడికి వెళ్లడం కష్టం కదా.అందుకే ఆలయంలోనే రెడీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు గుడి నిర్వాహకులు. ఆరోగ్యం , వివాహం, విద్య, ఉద్యోగం.. ఏ సమస్య వచ్చినా ఇక్కడి అమ్మవారిని వేడుకుంటే సమస్యలు తీరిపోతాయట. కోరిన కోర్కెలు తీరగానే వచ్చి మొక్కులు చెల్లిం చుకొంటా రు భక్తులు. అయితే,ఈ ఆచారం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నా యి. ఒకసారి కొంతమంది పశువుల కాపరులు చీరలు కట్టుకొని దగ్గర్లో ఉన్న ఒక రాయికి పూజలు చేశారట. అందులో దైవశక్తిని గమనించి‘కొట్టాన్‌’గా పిలిచి గుడి కట్టారట. అప్పట్నుంచి పురుషులు స్త్రీ వేషధారణలో ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఒకసారి కొబ్బరికాయను ఈ రాయికేసి కొడితే రక్తం వచ్చినట్టు చెబుతారు. అప్పట్నుంచి ఈ రాయిని పవిత్ర మైనదిగా భావిస్తున్నారు. ఈ రాయి పరిమాణం పెరుగుతూ వస్తోందట.