టీమిండియా పేసర్‌ షమిపై ఛార్జిషీట్

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి మరోసారి చిక్కుల్లో పడ్డాడు. కోల్‌కతా పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల అభియోగాల నమోదు చేశారు. అతడిపై నాన్‌ బెయిలబుల్‌ నేరాలతో కూడిన ఛార్జిషీట్‌ను అలీపోర్‌ పోలీసు కోర్టులో దాఖలు చేశారు. సెక్షన్‌ 498ఏ (వరకట్న వేధింపులు), 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసులు పెట్టారు. తన భార్య హసిన్‌ జహాన్‌తో షమీకి తీవ్ర విభేదాలున్న సంగతి తెలిసిందే. తన భర్తకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్లను జహాన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. గతేడాది మార్చి 7న ఈ వ్యవహారాన్ని బహిరంగం చేసింది.