విఫలమైన ఇజ్రాయిల్‌ మూన్‌ మిషన్‌

ఇజ్రాయిల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ ఫెయిల్ అయ్యింది. చంద్రుని ఉపరితలంపై దిగేందుకు ఉద్ధేశించిన బెర్షీట్‌ అంతరిక్ష నౌకలో చివరి దశలో టెక్నికల్ సమస్యలు రావడంతో మరికాసేపట్లో దిగుతుందనగా కుప్పకూలింది. గురువారం ల్యాండింగ్‌ సమయంలో రోబోటిక్‌ లాండర్‌లోని ఇంజిన్‌లో టెక్నికల్ సమస్యతో పాటు కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా దెబ్బతిందని మిషన్‌ సిబ్బంది తెలిపారు. చంద్రని ఉపరితలానికి 15-17 కిలో మీటర్ల దూరంలో ఉండగా కుప్పకూలి ఆ దేశానికి నిరాశను మిగిల్చింది మూన్ మిషన్.

ఇజ్రాయిల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా బెర్షీట్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఈ ప్రయోగానికి దాదాపు 100 కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్‌ స్పేస్‌ అంకుర సంస్థ స్పేస్‌ ఐఎల్‌, ఇజ్రాయిల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ను నిర్మించాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రనిపై సురక్షితంగా లాండర్‌ను దించిన నాలుగో దేశంగా ఇజ్రాయిల్‌ ఘనత సాధించి ఉండేది. ఇప్పటివరకు చంద్రునిపై అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సురక్షితంగా లాండర్లను ల్యాండ్ చేశాయి.

Latest Updates