భారత్‌ కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ధోనీనే : పాంటింగ్

టీమిండియా ప్లేయర్ ఎంఎస్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ రికీపాంటింగ్. ఒత్తిడి సమయాల్లో టీమిండియా ఇప్పటికీ మహేంద్రసింగ్‌ ధోనీపై ఆధారపడుతూనే ఉందన్నాడు. ఆటగాళ్లంతా ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోనీ ప్రశాంతంగా ఉంటూ టీమ్ ను ముందుకు నడిపించే తీరు వెలకట్టలేమని తెలిపాడు పాంటింగ్‌. ప్రస్తుతం ధోనీ నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నప్పటికీ కెప్టెన్‌ గా ఉన్న కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తున్నాడని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కి కోచ్‌ గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్‌ ఆదివారం ఓ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ గురించి పలు విషయాలు పంచుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ ను 2-3 తేడాతో భారత్‌ చేజార్చుకోవడంపై పాంటింగ్‌ స్పందిస్తూ.. వన్డేల్లో భారత్‌ ఒత్తిడిని జయించలేకపోతోందని.. ఒత్తిడి జయించడంలో ప్రస్తుతం భారత్‌ కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ధోనీనే అని తెలిపాడు. చివరి వన్డేల్లో ధోనీ లోకపోవడమూ సిరీస్‌ ఓటమికి ఒక కారణమేనని అన్నాడు. IPLలో ఆడే ఆటగాళ్లు టీమ్ ను విజయతీరాలకు చేర్చడంపైనే దృష్టిపెట్టాలన్నాడు. ప్రపంచకప్‌ లో చోటు కోసం ఇతరులను ఆకట్టుకోవాలన్న ఆలోచనతో ఆడితే ఆటలో రాణించలేమన్నాడు పాంటింగ్.

Latest Updates