భూకబ్జా కేసు : నయీం అనుచరులు అరెస్ట్

నయీం చనిపోయిన అతని అనుచరుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా భూకబ్జా వ్యవహారంలో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. పాశం శ్రీను, అబ్దుల్ ఫహి, అబ్దుల్ నజీర్, హసీనా బేగం, తుమ్మ శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 88 లక్షల రూపాయలు, 3 వాహనాలు  స్వాధీనం చేసుకున్నారు. నయీం బినామీ ఆస్తులను కబ్జా చేసేందుకు అతని అనుచరులు ప్రయత్నించారని తెలిపారు రాచకొండ సీపీ మహేశ్ భగవత్. కమర్షల్ కాంప్లెక్స్, ఖాళీ స్థలాలను వేరే వారి పేర్ల పైన రిజిస్టర్ చేయడానికి ప్రయత్నించారన్నారు.