
బతుకమ్మకు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడతరు. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో చేసినవి సమర్పిస్తరు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ రోజు పెరుగన్నం, పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం లాంటివి చేస్తరు. బతుకమ్మకు పెట్టే సత్తుపిండి పిల్లలు ఎంతో ఇష్టంగ తింటరు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మ అలుగుతుందని చెప్తరు పెద్దవాళ్లు. అందుకే ఆరో రోజు బతుకమ్మను చేయరట.
see more news