పిల్లలకు భోజనం వడ్డించి.. ఆనందపడ్డ మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర్ ప్రదేశ్ లోని బృందావన్ లో పర్యటించారు. అక్కడ.. అక్షయపాత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేసిన.. థర్డ్ బిలియన్స్ మీల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశం నుంచి ఆకలిని పారదోలేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషిని ప్రధాని ప్రశంసించారు. బృందావన్ చంద్రోదయ మందిర్ క్యాంపస్ లో.. ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మోడీ ఆవిష్కరించారు. తర్వాత 20 మంది పేద విద్యార్థులకు.. ప్రధాని స్వయంగా భోజనం వడ్డించారు. పిల్లలకు భోజనం వడ్డించడం.. ఎంతో ఆనందంగా ఉందని మోడీ ట్వీట్ చేశారు.

Latest Updates