రెవెన్యూ ప్రక్షాలన: రేపే ఉద్యోగుల అత్యవసర సమావేశం

రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్ ను ప్రక్షాలన చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలను తీసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభత్వం ప్రవేశపెట్టబోయే కొత్త చట్టం పై చర్చించేందుకు, తదుపరి తీసుకోవలసిన నిర్ణయాలపై మాట్లాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులందరూ మీటింగ్ కు వస్తున్నట్లు తెలిపారు.

ఈ మీటింగ్ లో డిప్యూటీ కలెక్టర్ సంఘం తో పాటు.. వి.ఆర్.ఓ/ వి.ఆర్.ఏ  యూనియన్లు కూడా పాల్గొంటున్నాయి. 16.04.2019 నాడు మధ్యహ్నం 2.30 నిమిషాలకు మూసారామ్ బాగ్, హైదరాబాద్ నందు ఉన్న రెవెన్యూ బిల్డింగ్ లో మీటింగ్ జరుగనుంది. ఇదివరకే సీఎం కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పలు మార్పులను తీసుకోస్తున్నట్లు తెలిపారు.

Latest Updates