మోడీ మళ్లీ ప్రధాని అవుతారన్న నమ్మకం లేదు: పట్నాయక్‌

ప్రధాని మోడీ మళ్లీ ప్రధాని అవుతారన్న నమ్మకం లేదన్నారు BJD అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. ఓ TV ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయితో  తాను పనిచేశానని గుర్తు చేశారు. ఆయన సమర్ధ ప్రధాని అని అన్నారు. ప్రస్తుత ప్రధాని మోడీ… మళ్లీ ప్రధాని అవుతారన్న నమ్మకం తనకైతే లేదన్నారు. వాజ్‌పేయితో మోడీని పోల్చలేమన్నారు.. మోడీ చెప్పింది ఏదీ చేయలేదన్న పట్నాయక్… యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కూడా వ్యాఖ్యలు చేశారు నవీన్ పట్నాయక్. ఆయనకు  ఇంకా పరిపక్వత రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మోజార్జీ రాని పక్షంలో ఒడిశాను ఆదుకునే వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బిజూ జనతాదళ్ (BJD) గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బస్సు యాత్రలో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన BJPకి సవాలు విసిరారు. రాష్ట్రానికి సీఎం అభ్యర్థి ఎవరో వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ తమ అభ్యర్తిని ప్రకటించేందుకు భయపడుతోందన్నారు. బీజేపీ నేతలు చెప్పే డబుల్‌ ఇంజన్ నినాదం ఒడిశాలో ఫెయిల్‌ అయ్యిందన్నారు సీఎం పట్నాయక్‌.

Latest Updates