- హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు నమోదు పారదర్శకంగా చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సూచించారు. జాబితాలో నమోదైన కొత్త ఓటర్ల వెరిఫికేషన్‌ను బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఈఆర్వోలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ALSO READ :లీడర్లకు కలిసి రావట్లే.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలకు గడ్డుకాలం
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటరు జాబితా ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలని స్పష్టం చేశారు. బీఎల్వోలు సత్వరమే ఓటరు జాబితాలో అప్ డేట్ చేయాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య పాల్గొన్నారు.