కొత్త డిజైన్లతో వాట్సాప్ ఎమోజీలు

whatsapp-emoji-with-new-designs

వాట్సాప్​లో ఎమోజీలు వాడటం చాలా కామన్. బాధ, సంతోషం, ప్రేమ, కోపం, నవ్వు వంటి భావోద్వేగాల్ని వెల్లడించడానికి ఇవి సులభమైన విధానం. తాజాగా ఎమోజీల్లో వాట్సాప్​ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. దాదాపు 155 ఎమోజీలను కొత్త డిజైన్లతో అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్​ వెల్లడించింది. ఆండ్రాయిడ్​ 2.19.139 వెర్షన్​ అప్​డేట్​లో కొత్త ఎమోజీలు అందుబాటులో ఉంటాయి. మొత్తం 357 ఎమోజీలను రీడిజైన్​ చేయాలనుకున్న వాట్సాప్​ గతంలో 21 ఎమోజీలను కొత్తగా రూపొందించగా, ఇప్పుడు 155 ఎమోజీల్ని మార్చింది. మిగతా వాటిలో కొన్ని ఎమోజీల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వాట్సాప్​ తెలిపింది. అలాగే ‘వాట్సాప్​ నైట్​మోడ్’ ఫీచర్ ను కూడా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించింది.

Latest Updates