మాకొద్దు ఈ మత్తు.. డీ అడిక్షన్ సెంటర్లకు క్యూ

ఫ్యాషన్ గా మొదలవుతున్న తాగుడు, సిగరెట్లు, డ్రగ్స్.. యువతను వదలకుండా పట్టేసుకుంటున్నాయి . వ్యసనంగా మారి తీరని పర్యవసానాలకు కారణమవుతున్నాయి . ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. దీంతో యువత డీఅడిక్షన్ సెంటర్ కు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు రోజూ 50 నుం చి 70 మంది వస్తున్నారని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అవసరమైన వారిని ఆస్పత్రిలో చేర్పించుకుంటున్నారు. అందుకోసం డీఅడిక్షన్ వార్డులో 30 బెడ్లను ఏర్పాటు చేశారు. డీ అడిక్షన్ సెంటర్ కు వస్తున్న వారిలో మద్యానికి బానిసైనోళ్లు 60 శాతం, గంజాయి, సిగరెట్​, గుట్కా వ్యసనంపరులు 30%, మత్తు ఇంజెక్షన్లు, నిద్రమాత్రలు, నొప్పి టాబ్లెట్లకు అలవాటైన వారు 10 శాతం మంది ఉన్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి కూడా డీఅడిక్షన్ కోసం పేషెంట్లు వస్తుండడం గమనార్హం. గంజాయి బాధితుల్లో ఎక్కువగా కర్నాటక సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా ఉంటున్నారు. రాష్ర్టంలో గుర్తింపు పొందిన డీఅడిక్షన్ సెంటర్లు 50 వరకూ ఉండగా, గుర్తింపు లేనివి వందల్లో ఉన్నాయి . అన్ని హాస్పిటళ్లు కలిపి రోజూ సగటున వెయ్యి మంది వరకు వస్తున్నారు.

పదిహేనేళ్లకే తాగుడు స్టార్ట్
​దేశంలో 70% మంది యువత పదిహేనేళ్లకే మందు తాగడం మొదలుపెట్టే స్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్​ అనే సంస్థ సర్వేలో తేలింది. ప్రస్తుతం మత్తు వదిలించుకోవడానికి వస్తున్న వారిలోనూ 15–40 ఏళ్ల వయసున్నవారే 60 శాతం ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో 25 ఏళ్లలో పు వాళ్లు 20 శాతం మంది ఉన్నారు. చదువుల ఒత్తిళ్లతో మద్యం , సిగరెట్​ తాగడాన్ని ఫ్యాషన్ గా యువత భావిస్తోందట. అందుకే పాఠశాల వయసులోనే మత్తు పదార్థా లకు అలవాటు పడుతున్నారని మానసిక నిపుణులు వివరిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడం, ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వాటిని మానేసేందుకు యువత ముందుకొస్తున్నట్టు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశ్వక్ రెడ్డి చెప్పారు. ట్రీట్​మెంట్​ కోసం వస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోందన్నారు. అది ఎలా అలవాటైందో తెలుసుకుని, మందులు, కౌన్సిలింగ్‌‌‌‌, సైకోథెరపీ వంటి చికిత్సను ఇస్తున్నట్టు చెప్పారు. 45 నుంచి 60 రోజుల పాటు డీ అడిక్షన్ చికిత్సను ఇస్తున్నామన్నారు.

మెదడుపై ప్రభావం
మద్యం, మత్తు పదార్థాలను అతిగా తీసుకుంటే మెదడుపై ప్రభావం పడుతుంది. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మతిమరుపు కూడా వచ్చే ప్రమాదముంది. డీ అడిక్షన్ కోసం వస్తున్న వారిలో మానసికంగా బాగా దెబ్బతిన్నవారిని ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ చేసుకుని ట్రీట్ మెంట్ ఇస్తున్నాం. లేదంటే మందులు, కౌన్సిలింగ్​ ఇచ్చి పంపిస్తున్నాం. తెలుగు రాష్ర్టాలతోపాటు కర్నాటక, మహారాష్ర్ట నుంచీ పేషెంట్లు వస్తున్నారు.
-డాక్టర్ ఉమాశంకర్ , సూపరిం టెండెంట్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల