
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయడానికి సాయం చేయాలని కోరారు. సవరించిన ప్రాజెక్ట్ వ్యయం 55 వేల 656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. 2005- 06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44 వేల కుటుంబాల నుంచి లక్ష కటుంబాలకు పెరిగిందన్నారు. అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. దీనివల్ల ఆర్ అండ్ ఆర్ కోసం పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయిందని చెప్పారు. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా 1779 కోట్ల రూపాయలు రీయింబర్స్ చేయాల్సి ఉందని కేంద్రమంత్రికి వివరించారు సీఎం జగన్ .