Happy Children's Day Special : పిల్లలతో ఇలా గడపండి.. సంతోషం మీ వెంటే.. రోజుకు కనీసం ఓ గంట..!

నవంబర్​ 14  .. ఈ రోజు బాలల దినోత్సవం.. అయితే పిల్లలు ఆనందంగా ఉండాలని ప్రతి పేరెంట్స్​ కోరుకుంటారు.. కాని అలాఉంటున్నారా.. లేదా  అనే విషయం మాత్రం పట్టించుకోరు.  కాని రోజుకొక  గంట సేపు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి చూడండి. పిల్లలు కేరింతలు కొడుతూ ఎంత ఆనందంగా ఉంటారు. మీరూ అంతకంటే ఎక్కువ ఆనందంతో ఉంటారు. ఇవన్నీ ఎవరికీ తెలియక కాదు. పెద్దల ప్రయారిటీ లిస్టులో పిల్లలు వెనక్కిపోవడమే అసలు సమస్య. ఈ సమస్య మీ ఇంట్లో ఉందేమో? చెక్ చేసుకోండి.  పేరెంట్స్ సర్కిల్' పేరుతో రియలైజ్ అయిన కొందరు తల్లిదండ్రులు ...గాడ్జెట్స్ డిస్ కనెక్ట్ చేసి .. . పిల్లలతో కనెక్ట్​ అవ్వాల్సిన అవసరం ఉంది.  

ఇం ట్లో అందరూ ఉంటారు. కానీ ఎవడూ లేనట్లే ఫీలవుతుంటారు పిల్లలు.  పేరెంట్స్ వాట్పాప్​ లో  బిజీనెస్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు. సోషల్ స్టేటస్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్​ లు , లైక్ లు, కామెంట్స్ బిజీనెస్ కొని తెచ్చుకుంటారు. మమ్మీ.. డాడి అంటూ పిల్లలు దగ్గరకొస్తే చేతిలోని గాడ్జెట్ పక్కన పెట్టి పిల్లల్నిచేతుల్లోకి తీసుకోవడం తగ్గిపోతుంది.  అందుకే రోజుకొక గంటపాటు పిల్లలకు కేటాయించి.. ఫోన్​.. గాడ్జెట్స్​ స్విచ్చాఫ్​ చేసేద్దాం.. 

కొన్ని ఇళ్లలో బిజీగా ఉన్నప్పుడు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ల చేతికి  ఓ గాడ్జెట్​ను  పెద్దలే అంటగడుతున్నారు.. అవసరానికి మించి గాడ్జెట్స్ వినియోగం మంచిది కాదని పెద్దలకు చెబుతుంటే....ఆ పెద్దలే అవసరం లేని వాటిని పిల్లలకు అంటగడుతున్నారు. అమ్మానానల్లాగే పిల్లలూ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లతో యూట్యూబ్,  నెట్ ఫ్లెక్స్, అమెజాన్​ లో  సినిమాలు సిరీస్ లు  చూస్తున్నారు. అదే వాళ్ల ప్రపంచం సినిమాలే ఆశలు, సిరీస్ లే వాళ్ల ఆలోచనలగా మారతాయి.  

ALso Read : ఈ పిండి వంటలు వండి పెట్టండి

ఇది పిల్లల కంటిచూపు, శారీరక ఎదుగుదల పైనే కాదు... మానసిక ఎదుగుదలపైనా చెడు ప్రభావం చూపుతుందని తెలుసు.   అయినా ఈ ఒక్క రోజే అనుకుంటూ రోజూ పిల్లల్ని డీల్ చేస్తున్నారు పేరెంట్స్​.   ఈ తప్పుని సరిదిద్దుకోకుంటే రేపటి ముప్పు మనదే అని గుర్తించిన కొంత మంది పేరెంట్స్ కనువిప్పుతో వినిపించే కొత్త స్లోగనే ఈ గార్డెట్ ఫ్రీ అవర్.   రోజూ కొంత సమయం  ఫోన్లని స్విచ్ఛాఫ్ చేసి, కంప్యూటర్లని పక్కకు పెట్టి పిల్లలతో  ప్రేమగా ఆడుకోవాలి.  పిల్లలకు ప్రపంచం గురించి  నేర్పాల్సిన బాధ్యత మన చేతుల్లోకి తీసుకోవాలి.  

అమెరికాలో గాడ్జెట్స్ వాడకం ఎక్కువ. దీని వల్ల ఉండే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసేలా చేయాలని....  వాటిని తగ్గించుకోవడం అలవాటు చేయాలని గాడ్జెట్ ఫ్రీ డేస్ జరుపుకుంటున్నారు.  ఇప్పుడు మనం కూడా గాడ్జెట్స్ ఎడిక్ట్ అవుతున్నం. కాబట్టి  వాటి నుంచి బయటపడాలని ఈ ఆలోచనన చేస్తున్నరు. రోజులో ఓ గంట ...  మీరు పిల్లలతో కనెక్ట్​  అయితే ఆ ఆనందం  నుంచి మళ్లీ డిస్​ కనెక్ట్​ కాలేరని చెబుతున్నారు. అంటే అన్ని రోజులూ  ఇలాగే ఉంటారని, ఉండాలన్నదే వాళ్ల రిక్వెస్ట్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కోలకతా.. మొదలైన సిటీస్​ లో  గాడ్జెట్ ఫ్రీ ఆవర్​ పై  రియాక్ట్​ అవుతున్నారు. ప్రతి ఇంట్లో...  ప్రతి రోజూ ... గార్లెట్ ఫ్రీ అవర్'చేసుకోవాలని కోరుతున్నారు.

స్కూలుకు పోయి పిల్లలు ఇంటికి వచ్చిన తరువాత ఫ్రెషప్ అయి స్నాక్స్ తీసుకున్న తర్వాత రోజూ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు, వీడియో గేమ్ లతో టైమ్ పాస్ చేయకుండా కాసేపు మీతో వాళ్లు, వాళ్లతో పేరెంట్స్​  ఎంజాయ్ చేయాలి.   "నవంబరు 14 పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ విషయం గురించి పేరెంట్స్ అందరూ రియలైజ్ కావాలని 'గాడ్జెట్ ఫ్రీ ఆవర్' కి సోషల్ మీడియాలో పిలుపునిచ్చింది. రియల్ లైఫ్ బాండ్​ని ఎంజాయ్ చేయాలని సిటీల్లో కొత్త పిలుపు వినిపిస్తోంది.

‌‌–వెలుగు,లైఫ్​–