గ్రేట్ రియల్ ఎస్టేట్ స్కాం : స్వర్గంలో 100 డాలర్లకే భూమి.. వేల మంది కొన్నారు కూడా...

భూమి మీద స్థలాలకు డిమాండ్ అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. పెరుగుతున్న జనాభాకు ఫ్యూచర్ లో భూమి దొరకడం కష్టమవుతుందని.. ఈ క్రమంలో భూముల ధరలు సామాన్యుడి నెత్తిన పిడుగులా మారతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది శక్తి మేరకు వీలైనంత భూమిని కొనుగోలు చేస్తున్నారు. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే ఏకంగా చంద్రుడి మీదనే ప్లాట్లు కొనుక్కుంటున్నారు. అయితే చంద్రుడి మీద, భూమ్మీద కాదు.. ఏకంగా స్వర్గంలోనే ప్లాట్లు అమ్ముతున్నాడో వ్యక్తి . అది కూడా  హైదరాబాద్ కంటే చాలా చౌక ధరకే అమ్ముతున్నాడు. స్వర్గంలో   ప్లాట్ల విక్రయాలు ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి....
 
అసలు స్వర్గం ఉందో లేదో తెలియదు కాని.. ఒకవేళ ఉంటే ఆ ప్రాంతం ఎలా ఉంటుందో కూడా తెలియదు.  కాని ఇప్పుడు ఓ వ్యక్తి 2017 లో స్వర్గంలో ఉండే వారితో.. అదేనండి దేవుళ్లతో మాట్లాడానని వారితో రియల్​ ఎస్టేట్​ డీల్​ కుదుర్చుకున్నానని చెబుతున్నాడు.  అక్కడ రేటు కూడా నిర్ణయించారు. చదరపు మీటరు 100 డాలర్లు అంటే  8 వేల 350 రూపాయిలు అన్నమాట. ఈ లెక్కప్రకారం చూస్తే ఎకరం రూ. 3 కోట్లకు పైగా ఉంది.   ఇలా చెబుతూ  తాను విక్రయించే స్థలాలు ఇంద్రుడి నివసించే ఇంటి పక్కనే  వెంచర్​ కూడా ఉందని ఆయన తెలిపాడు.  దీనికి సంబంధించిన ఒక బ్రోచర్​సోషల్ మీడియాలో వైరల్​ అవుతుంది. 

ఈ వీడియోలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి  బంగారు కిరణాలతో అందంగా కనువిందు చేస్తున్న విలాసవంతమైన ఇల్లు కూడా కనిపిస్తోంది. ఈ ఇంటిలో నలుగురు కుటుంబ సభ్యులు సంతోషకరంగా జీవించబోతున్నట్లు కనిపిస్తుంది. 2017 నుంచి స్వర్గంలో భూములను విక్రయించడం ద్వారా చర్చి మిలియన్ల డాలర్లను సంపాదించినట్లు తెలుస్తోంది.అయితే ఈ వీడియో నిజానికి సెటైర్‌గా తయారైందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇది మొదట ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయబడింది. ఇది హాస్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేయడంలో పేరుగాంచింది. అప్పటి నుండి వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది. మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు.

ఈ వీడియో ట్విట్టర్‌లో @chude__ అనే IDతో షేర్ చేశారు. అందులో మేఘాల్లో ఒక ఇల్లు తేలుతుండగా.. ఎదురుగా ఒక కుటుంబం మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. ఈ పిక్ కింద మరో పిక్ ఉంది. ఆ పిక్ లో ఒక ఇంటి ఎదురుగా తండ్రీ, కూతురికి దేవుడు  స్వాగతం చెబుతున్నట్లు ఉంది.  .. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక వ్యక్తి  2023లో తన దగ్గరకు వచ్చిన వారి నుంచి భూములు, ఆస్తులు అమ్మించి వారితో స్వర్గంలో స్థలాలు కొందరితో కొనిపించాడు. ఇప్పడు మరొకరు  స్వర్గంలో ప్లాట్స్ న అమ్ముతూ వైరల్ అయ్యాడు. ఈ వార్త విన్న రియల్ ఎస్టేట్ నిపుణుడు అర్మాండో పాంటోజా దాని మీద కౌంటర్ గా ఒక వీడియో చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ డీల్​ స్కాం  అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్ష మంది వీక్షించారు. 

 తనకు ఎవరైనా 100 డాలర్లు అప్పుగా ఇస్తే తాను కూడా తన కోసం స్వర్గంలో భూమిని కొనుగోలు చేయాలనీ కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. మరొకరు ఇది ‘శతాబ్దపు అతిపెద్ద జోక్’ అని పేర్కొన్నారు. మరొకరు  దయచేసి నాకు 100 బస్సులను ఎవరు అప్పుగా ఇవ్వగలరు? నేను నా స్వర్గపు రుణాన్ని పొందాలనుకుంటున్నానని కామెంట్​ చేశారు.  ఇంకొకరు  నేను డౌన్ పేమెంట్ పొందవచ్చా?" అని ఫన్నీగా అడిగారు. ఇంకొంతమంది నకిలీ అవతారం ఎత్తి అబద్దాలను విజయంతంగా విక్రయిస్తారంటూ.. వారు మెటావర్స్​ ను నిర్మిస్తున్నారని కామెంట్​ చేశారు. 


 ఇక స్వర్గంలోని ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ఆవ్యక్తి  బంపరాఫర్ ప్రకటించారు. అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డులైన వీసా, మాస్టర్, మాస్ట్రో, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే కార్డులతో చెల్లింపులు చేయవచ్చని వివరించారు. అంతేకాకుండా యూపీఐ యాప్స్ అయిన గూగుల్ పే, యాపిల్ పే వంటి డిజిటల్ వ్యాలెట్‌లతోనూ డబ్బులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఇవేకాకుండా ఇన్‌స్టాల్‌మెంట్‌ పద్దతిలో కూడా ప్లాట్లకు డబ్బులు కట్టే సదుపాయాన్ని కూడా కల్పించారు.