ఐదు నెలల్లో పది లక్షల మంది

ఐదు నెలల్లో పది లక్షల మంది

హైదరాబాద్​, వెలుగు: దుబాయ్​కు వెలుతున్న ఇండియన్ల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2019తో పోలిస్తే 2023 మొదటి 5 నెలల్లో విజిటర్ల సంఖ్య 23 శాతం పెరిగిందని దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ (డీఈటీ) తెలిపింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో పది లక్షల మంది దుబాయ్​ను సందర్శించారు. 

దుబాయ్ ​గురించి ప్రచారం చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం,  ఉత్తరప్రదేశ్‌లలోని 30 నగరాల నుంచి 200 మందికి పైగా ట్రావెల్ ఏజెంట్‌‌‌‌‌‌‌‌లతో  ప్రచార కార్యక్రమాలను నిర్వహించామని తెలిపింది.  

ALSO READ:పొద్దున 7 గంటలకు టిఫిన్.. మధ్యాహ్నం 3 గంటలకు భోజనం

వేసవి సెలవుల కోసం దుబాయ్‌‌‌‌‌‌‌‌ని అంతర్జాతీయ గమ్యస్థానంగా మార్చడానికి ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్, బెంగళూరు,  చెన్నైలలో రోడ్‌‌‌‌‌‌‌‌షోలను నిర్వహించామని డీఈటీ పేర్కొంది.