‘మహాన్’... ట్రైలర్ అదిరింది

‘మహాన్’... ట్రైలర్ అదిరింది

హీరో విక్రమ్.. ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ కలసి నటించిన సినిమా ‘మహాన్’ ట్రైలర్ అదిరింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువైన విక్రమ్ తాజా మూవీలో ప్రధాన పాత్రలో నటించగా.. ఆయన తనయుడు కూడా నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది.  టీజర్ లో తండ్రికిచ్చిన మాట తప్పిన తనయుడు.. ఏం చేశాడు అన్న సస్పెన్స్ ను క్రియేట్ చేస్తున్న డైలాగులు ఆకట్టుకున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 10వ తేదీన ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. 
మూవీ రిలీజ్ ను పురస్కరించుకుని ఇవాళ విడుదల చేసిన టీజర్.. మాస్ ఎలిమెంట్స్ తో ‘మధ్య నిషేధం’ కోసం పోరాడిన తండ్రి ఆశయాన్ని.. ఆయనకిచ్చిన మాటను తనయుడు ధిక్కరించి ఏం చేశాడంటూ.. సస్పెన్స్ క్రియేట్ చేసే డైలాగులు కాన్సెప్ట్ చూస్తుంటే.. ఈ మూవీ కూడా ‘అపరిచితుడు’ తరహాలోనే సందేశాత్మక మూవీ అయి ఉంటుందని తెలుస్తోంది. మద్యపాన నిషేధం కోసం పోరాడిన తండ్రి.. తన కొడుకును గాంధీ మహాత్ముడిలా తయారు చేయాలనుకుని ‘మహాన్’ అని పేరు పెట్టి..  ఆశయాన్ని నెరవేరుస్తానని కొడుకు దగ్గర మాట తీసుకుంటే.. పెద్దయ్యాక కొడుకు  తండ్రికిచ్చిన మాట తప్పి.. అతనికే శత్రువులా మారినట్లున్న డైలాగులు సస్పెన్స్ ని క్రియేట్ చేస్తోంది.  
మూవీలో హీరో విక్రమ్.. మద్య నిషేధం కోసం ఉద్యమాన్నే నడిపిన గొప్ప యోఢుడిలా కనిపిస్తే.. తండ్రి ఆశయానికి తూట్లు పొడిచేలా.. ఆయన తనయుడే ప్రజలకు మద్యాన్ని దొంగచాటుగా సరఫరా ఎందుకు చేశాడు.. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే  ‘మహాన్‌‌‌‌’ మూవీ చూడాల్సిందే. ట్రైలర్ చూస్తుంటే విక్రమ్ ఈ సినిమాలో కూడా ‘అపరిచితుడు’తరహాలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. అతని కొడుకు ధృవ్‌‌‌‌ కూడా ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో నటించడం ఆసక్తికరంగా మారింది. లలిత్‌‌‌‌ కుమార్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 10న అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ ద్వారా.. తమిళంతో పాటు తెలుగు,  మలయాళ, హిందీ భాషల్లోనూ ఇదే టైటిల్‌‌‌‌. కన్నడలో మాత్రం ‘మహాపురుష’ అనే టైటిల్‌‌తో విడుదలవుతోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి..

ఎన్నికల ముందు చెప్పిన మాటలు చేతల్లో కనిపించట్లే

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి