Good Alert : ఈ సెన్సర్.. మన ఆరోగ్యం ఎంత ఉందో చెప్పేస్తుంది

మార్కెట్ లోకి కొత్తగా ఫిట్నెస్ సెన్సర్ వచ్చింది. ఇది మామూలు సెన్సర్ లా కాదు. ఈ సెన్సర్ చెమట చూసి శరీరంలో ఏమేం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పేస్తది. 

* ఫిట్నెస్ బ్యాండ్స్, వాచీలను బయట చూస్తుంటాం. అవి మణికట్టు దగ్గర వాటికున్న సెన్సర్ తో పల్స్ రేట్, హార్ట్ బీట్ ను చూపిస్తాయి. రోజులో ఎన్ని అడుగులు నడిరో చెప్తాయి. స్లీప్ ట్రాకింగ్ చేస్తాయి. క్యాలరీలు ఎన్ని కరిగాయో చూపిస్తాయి. కాకపోతే ఈ ఎంఎక్సినస్ ఫిట్నెస్ సెన్సర్ హెల్తు కూడా మానిటర్ చేస్తుంది. దీన్ని ఈ మధ్యే సౌదీ అరేబియాకు చెందిన కంపెనీ తయారుచేసింది.

* ఎంఎక్సినస్ అనేది గ్రాఫిన్ లాగ టు- డైమెన్షనల్ ట్రాన్సిషన్ మెటీరియల్. ఎంఎక్సి నస్ మెటీరియల్ కార్బన్, నైట్రోజన్, టైటానియంలు కలిసి ఉన్నాయి. అలాగని ఇది విషపూరితమైన మెటీరియల్ మాత్రం కాదు. ఈ సెన్సర్లు శరీరంలో కలిగే రసాయన మార్పులను గుర్తిస్తాయి. ఇదెలా పని చేస్తుందంటే...
చెమటలో ఉండే పిహెచ్ లో గ్లూకోజ్, లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. వీటితో ఆ సెన్సర్ రియాక్ట్ అయ్యి... హెల్త్ను అనలైజ్ చేసి చూపిస్తుంది. కాకపోతే ఇది ఇంకా స్పోర్ట్స్ ఆడేవాళ్ల కోసమే అందుబాటులో ఉంది.

Also read :పసుపు కొమ్ములకు.. ప్యాకెట్ పసుపునకు తేడా ఏంటీ.. ఏది తింటే మంచిది

• 'ఎక్సర్ సైజ్ చేస్తున్నపుడు లేదా అలసిపోతున్న పుడు కలిగే ఒత్తిడితో వచ్చే చెమటలోని పిహెచ్ కలిసి శరీరంలో జరిగే మార్పులను ఈ సెన్సర్ గుర్తిస్తుంది'. బ్లూటూతో దగ్గరలో ఉన్న డివైజ్ లకు కనెక్ట్ చేసుకొని దీన్ని వాడొచ్చు. ఎంఎక్సినస్ సెన్సర్ను మరింత డెవలప్ చేసి ఫ్యూచర్లో ఇంకా కొత్త డిజైన్లలో అందు బాటులోకి తెస్తామని చెప్పారు కంపెనీ వాళ్లు.