ఫ్లోరిడా సిటీని వదిలి వెళ్లిపోండి.. తుఫాన్ విధ్వంసంపై అలర్ట్

హరికేన్ ఇడాలియా తెల్లవారుజామున (స్థానిక సమయం) ఫ్లోరిడాలో తీరాన్ని తాకే అవకాశం ఉందని అమెరికన్ నేషనల్ హరికేన్ సెంటర్ (NHC) తెలిపింది. ఈ ప్రభావం నివాసితులు అలాగే సమీప రాష్ట్రాలపై పడే ఛాన్స్ ఉన్నట్టు అంచనా వేసింది. హరికేన్ ఇడాలియా ఫ్లోరిడాలోని గల్ఫ్ తీరంలో ల్యాండ్ ఫాల్ చేసే ముందు కేటగిరీ III ప్రధాన హరికేన్‌కు చేరుకుంటుందని అంచనా వేసింది.

ALSO READ :కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ ఎత్తివేత

ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ వారం కిందటే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్రంలోని 67 కౌంటీలలో 49 ప్రాంతాలు ఇంకా అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఫ్లోరిడాతో పాటు, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఇడాలియా హరికేన్ ప్రాణానికి ముప్పు కలిగించే సంఘటన అని US ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేటర్ డీన్నే క్రిస్వెల్ హెచ్చరించారు.

ఇప్పటికే అక్కడి చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, హరికేన్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి పది కిలోమీటర్ల లోపలికి వెళ్లవచ్చని డిసాంటిస్ చెప్పారు.