భైంసా, వెలుగు: బీసీ కుల వృత్తిదారులకు ప్రభుత్వం అందించనున్న రూ. లక్ష సాయం పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. భైంసా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 682 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 173 మంది ఇతర కులస్థులు దరఖాస్తు చేసుకోవడంతో వాటిని తిరస్కరించారు.
509 మందిని అర్హులుగా గుర్తించగా.. ఇంతకు ముందే ముగ్గురు రుణం తీసుకున్నారు. దరఖాస్తులో పేర్కొన్న వివరాల ఆధారంగా మంగళవారం మూడు బృందాలు సర్వే నిర్వహించాయి. ఫైనల్ రిఫోర్టును ఉన్నతాధికారులకు పంపనున్నట్లు కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు.